INDWvsENGW: భారత పర్యటనలో ఇంగ్లండ్ అదరగొడుతోంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లీష్ జట్టు.. శనివారం వాంఖడే (ముంబై) వేదికగా జరుగుతున్న రెండో టీ20లో కూడా రెచ్చిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. 16.2 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 30, 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా ఏకంగా తొమ్మిది మంది భారత బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో ధాటిగా ఆడిన ఓపెనర్ షఫాలీ వర్మ రెండు బంతుల్లో పరుగులేమీ చేయకుండానే చార్లెట్ డీన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. స్మృతి మంధాన (9 బంతుల్లో 10, 2 ఫోర్లు) రెండు ఫోర్లు కొట్టినా ఆమె కూడా డీన్ వేసిన నాలుగో ఓవర్లో రెండో బంతికి ఎల్బీగా వెనుదిరిగింది. ఆ తర్వాత భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
🇮🇳 80 ALL-OUT!! 😲
England need 81 Runs to win the series. #CricketTwitter #INDvENG pic.twitter.com/37WrEbJGZ4
— Female Cricket (@imfemalecricket) December 9, 2023
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (9), దీప్తి శర్మ (0), రిచా ఘోష్ (4), పూజా వస్త్రకార్ (6), శ్రేయాంక పాటిల్ (4), టిటాస్ సాధు (2), సైకా ఇషాక్ (8) లు విఫలమయ్యారు. రేణుకా సింగ్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో రోడ్రిగ్స్ కూడా 8 వ వికెట్‌గా వెనుదిరిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో డీన్‌తో పాటు లారెన్ బెన్, ఎక్లిస్టోన్, సారా గ్లెన్ లు తలా రెండు వికెట్లు తీశారు. సీవర్ బ్రంట్, ఫ్రెయా కెంప్లు చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.