INDWvsAUSW: భారత్ – ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ ఓపెనర్ ఫోబె లిచ్‌ఫీల్డ్ (125 బంతుల్లో 119, 16 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ అలిస్సా హీలి (85 బంతుల్లో 82, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు ఏకంగా 189 పరుగులు జోడించడంతో ఆ జట్టు భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్‌కు ఓపెనర్లే అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇదివరకే రెండు వన్డేలను గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకున్న కంగారూలు ఈ మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయి ఆడారు. భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఈ ఇద్దరూ వికెట్ కోల్పోలేదు. భారీ భాగస్వామ్యం తర్వాత ఈ జోడీని ఎట్టకేలకు పూజా వస్త్రకార్ విడదీసింది. ఆ తర్వాత వచ్చిన ఎలీస్ పెర్రీ (16), బెత్ మూనీ (3), తహిలా మెక్‌గ్రాత్(0) లు విఫలమయ్యారు.
Phoebe Litchfield, born in 2003, playing her first ODI series in Asia and has completely dominated India in the series ⭐
78(89) in the first ODI.
63(98) in the second ODI.
119(125) in the third ODI.The future star of world cricket. pic.twitter.com/DkEMqHozLI
— Johns. (@CricCrazyJohns) January 2, 2024
ఈ సిరీస్‌లో ఇదివరకే రెండు అర్థ సెంచరీలు చేసిన లిచ్‌ఫీల్డ్.. ఈ మ్యాచ్‌లో 109 బంతుల్లో సెంచరీ పూర్తిచేసింది. వన్డేలలో ఆమెకు ఇది రెండో శతకం. దీప్తి శర్మ ఆమెను పెవిలియన్‌కు పంపంది. ఆఖర్లో అన్నాబెల్ సదర్లాండ్ (23), అలానా కింగ్ (14 బంతుల్లో 26 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఆసీస్ 330 ప్లస్ టార్గెట్‌ను భారత్ ముందు నిలపగలిగింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ మూడు వికెట్లు తీయగా అమన్‌జ్యోత్ కౌర్ రెండు వికెట్లు తీసింది.