న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ క్రైస్తవ ఉనికికి, హెచ్1బీ వీసాలకు ముడిపెట్టారు. అమెరికాకు నిజమైన క్రైస్తవ గుర్తింపు గర్భస్థ శిశువు పరిరక్షణ గురించి మాత్రమే కాదని స్పష్టం చేసిన వాన్స్ దాన్ని అమెరికన్ ఉద్యోగాలు, హెచ్1బీ వీసాలతో ముడిపెట్టారు. వర్ధమాన దేశాల్లోని చవక ప్రత్యామ్నాయాలను అమెరికన్ కంపెనీలు ఆశించడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు.
విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికన్ కంపెనీలు ఉపయోగించుకుంటున్న హెచ్-1బీ వీసాలను వాన్స్ ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి కూడా పెద్ద మనసు ఉంటుందని టర్నింగ్ పాయింట్ యూఎస్ఏకి చెందిన అమెరికా ఫెస్ట్ సండే కార్యక్రమంలో ప్రసంగిస్తూ చెప్పారు.
అమెరికన్ ఉద్యోగాలను విదేశాలకు తరలిస్తున్న కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే తాము మనిషి శ్రమను గుర్తిస్తామని, తమ దేశానికి సేవలందచేస్తున్నవారిని గౌరవిస్తామని వాన్స్ తెలిపారు. వాన్స్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికన్లు నైపుణ్యం లేని కారణంగా పనికిరాకుండా పోయారని ఓ నెటిజన్ అన్నారు.