మౌంట్‌మాంగనీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Women’s World Cup) భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది. 36 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా బ్యాటర్లు ఆరంభం నుంచే తడపడ్డారు. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి టాపర్డర్ స్వల్ప పరుగులకే టాప్ఆర్డర్ కుప్పకూలింది. తరువత వచ్చిన బ్యాటర్లు కూడా తక్కువ స్కోర్లకే పెవీలియన్ బాటపట్టారు.
కేవలం స్మృతి మంధాన, రిచా ఘోష్, జులన్ గోస్వామి మాత్రమే అంతో ఇంతో ఇంగ్లండ్ బౌర్లను ఎదుర్కొని నిలబడగలిగారు. 35 పరుగులు చేసిన స్మృతి టాప్ స్కోరర్‌గా నిలువగా, రిచా 33, గోస్వామి 20 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ చార్లెట్ డీన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, అన్యా శ్రబ్సోలే రెండు వికెట్లు, సోఫి, నైట్ తలా ఒక విటెక్ తీశారు.