Pink Jersey | నేడు భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డే.. పింక్ జెర్సీలో కనిపించనున్న టీమిండియా వుమెన్స్ టీమ్..!
Pink Jersey | ఢిల్లీ అరుణ్ జైట్ల స్టేడియంలో శనివారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి వన్డేలలో భారత జట్టు పింక్ కలర్ జెర్సీలో కనిపించనున్నది. రొమ్ము క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు ఈ జెర్సీలో టీమిండియా ఆడనున్నది. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వీడియోను రిలీజ్ చేసింది.
Pink Jersey | ఢిల్లీ అరుణ్ జైట్ల స్టేడియంలో శనివారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి వన్డేలలో భారత జట్టు పింక్ కలర్ జెర్సీలో కనిపించనున్నది. రొమ్ము క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు ఈ జెర్సీలో టీమిండియా ఆడనున్నది. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వీడియోను రిలీజ్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ప్రతీకా రావల్, స్నేహ్ రాణా పింక్ జెర్సీలో కనిపించారు. “రొమ్ము క్యాన్సర్ అవగాహనను ప్రోత్సహించేందుకు టీమిండియా ఇవాళ జరిగే మూడు వన్డేల్లో స్పెషల్‌గా పింక్ కలర్ జెర్సీలను ధరిస్తుందని బీసీసీఐ పేర్కొంది. అయితే, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తదితర ఫ్రాంచైజీలు సైతం క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు మద్దతుగా ప్రత్యేక కిట్‌లో కనిపించాయి.
ఇదిలా ఉండగా.. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే భారత్-ఆస్ట్రేలియా జట్లు 1-1తో సమయంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సెప్టెంబర్ 30 వుమెన్స్ వరల్డ్ కప్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కీలక టోర్నీకి ముందు సన్నాహకంగా ఉపయోగపడనున్నది. భారత పేస్ అటాక్, టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌తో సిరీస్‌లో బాగానే రాణించింది. కానీ, మిడిల్ ఆర్డర్ ఆందోళన కలిగిస్తున్దని. బలంగా ఉన్న ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్‌పై అద్భుతంగా రాణించి హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని జట్టు ప్రపంచకప్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. మరో వైపు ఆస్ట్రేలియా సైతం ఈ సిరీస్‌ను నెగ్గి ప్రపంచకప్‌కు ముందు భారత్‌పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నది.
𝙏𝙝𝙖𝙣𝙠𝙨 𝙖 𝘿𝙤𝙩! 🩷#TeamIndia will be wearing special pink-coloured jerseys in the Third ODI today to promote Breast Cancer Awareness, in partnership with @SBILife 👏👏#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/qnJukLLxoh
— BCCI Women (@BCCIWomen) September 20, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

