వారిద్దరూ ఫామ్‌లో లేరు కాబట్టి.. దాయాదుల పోరులో గెలిచేది ఎవరో చెప్పిన పాక్ మాజీ పేసర్
IndvsPak | టీ20 ప్రపంచకప్‌లో అత్యంత రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి.

IndvsPak | టీ20 ప్రపంచకప్‌లో అత్యంత రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచకప్ టోర్నీల్లో ఒక్కసారి కూడా పాక్ చేతిలో భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ జట్టు కసిగా ఉంది.
పాక్ జట్టు సారధి బాబర్ ఆజమ్ అద్భుత ఫామ్‌లో ఉండటం ఆ జట్టులో ఆశలు రేపుతోంది. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ రెండు జట్ల బలాబలాలను విశ్లేషించాడు. యూఏఈ పరిస్థితుల విషయంలో పాక్ కన్నా భారత జట్టుకే ఎక్కువ సానుకూలత ఉందని ఆమిర్ అన్నాడు.
ఎందుకంటే భారత క్రీడాకారులు కొన్నిరోజుల క్రితం వరకూ ఇక్కడే ఐపీఎల్ ఆడారని, అందుకే ఇక్కడి పరిస్థితులకు వారు బాగా అలవాటు పడ్డారని ఆమిర్ వివరించాడు. అదే సమయంలో బ్యాటింగ్ విభాగంలో పాక్ జట్టు కొంత బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

భారత జట్టు వద్ద మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ రోహిత్, కోహ్లీ ఇద్దరూ కూడా ఐపీఎల్లో కొంత ఇబ్బంది పడటం చూశామని గుర్తుచేశాడు. టీ20 క్రికెట్లో దేన్నీ అంచనా వేయలేమని చెప్పాడు. అయితే పరిస్థితులకు అలవాటు పడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు కొంత ఎక్కువ ఉన్నాయని అన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం భారత్‌కు 60 శాతం, పాకిస్థాన్‌కు 40 శాతం ఉందని పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

