INDvsAFG: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇండోర్‌లో ఉంది. అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా.. రెండ్రోజుల క్రితమే మొహాలీలో అఫ్గాన్‌ను ఓడించి ఆదివారం అఫ్గాన్‌తో రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. హొల్కర్ స్టేడియంలో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం టీమిండియా క్రికెటర్లు గురువారమే ఇండోర్‌కు చేరుకున్నారు. ఇండోర్‌కు వచ్చే క్రమంలో మెన్ ఇన్ బ్లూ.. ఈ నగరంలో తమకు నచ్చిన ప్రదేశాలు, ఆహారం వంటి వాటి గురించి మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
బీసీసీఐ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా ఇండోర్‌లో తమకు ‘పోహా’ (అటుకులతో చేసే వంటకం) అంటే తమకు చాలా ఇష్టమని చెప్పారు. పోహాతో పాటు టీమిండియాలో ఉన్న అవేశ్ ఖాన్ అంటే కూడా చాలా ఇష్టమని కామెంట్స్ చేశారు. అవేశ్ ఖాన్ ఇండోర్‌కు చెందినవాడే..
No prizes for guessing where we are 😁
What happens when you have fun on your travel day 😎#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/1Xr8ZyDV5v
— BCCI (@BCCI) January 13, 2024
ఇండోర్‌కు వస్తే ఇక్కడికి దగ్గరగా ఉండే ఉజ్జయిని మహా దేవాలయం, మహాకాళేశ్వర్ ఆలయం వంటి వాటిని తప్పక దర్శిస్తామని క్రికెటర్లు చెప్పారు. అవేశ్ ఖాన్ కూడా వీడియోలో ఆఖర్లో మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మా నగరం ఇండోర్‌కు మీకు స్వాగతం..’ అని తెలిపాడు. ఇక వీడియోలో సంజూ శాంసన్.. ‘ఇండోర్‌లో నాకు అవుట్ డోర్ అంటే ఇష్టం’ అని అని ఫన్నీగా కామెంట్ చేశాడు. ఇండోర్‌లో జనాలు ఇండ్లళ్లో ఉంటూ జోకులు చేస్తారని, ఇక్కడి ప్రజలు ఫన్నీగా ఉంటారని అందుకు తమ జట్టులో ఉండే అవేశ్ ఖానే సాక్ష్యమని సంజూ చెప్పుకొచ్చాడు.