బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ముగ్గురు దిగ్గజాలు ముంబైలోని ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా కలిసినట్లు తెలుస్తుంది. సినిమా, క్రికెట్ రంగానికి చెందిన ఈ ముగ్గురు సూపర్ స్టార్లను ఒకేసారి చూడటం అభిమానులకు కనువిందుగా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు లెజెండ్స్, ఇండియన్ పవర్ హౌస్ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇంకా వీరే కాకుండా అక్షయ్ కుమార్, తమిళ నటుడు సూర్య కూడా ఈ వేడుకలో పాల్గోన్నారు.
The GOD of Cricket #SachinTendulkar with The GOD of Acting #AmitabhBachchan 🙌🔥@SrBachchan Sir @sachin_rt Sir @AlwaysRamCharan #ISPLSeason3 #RamCharan pic.twitter.com/x3VeJHkOWu
— Shani (@JrYadav1409) January 9, 2026