Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో రికార్డు శతకంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 64 బంతుల్లోనే సెంచరీ చేసిన రోహిత్‌కు పొట్టి క్రికెట్లో ఇది ఐదో శతకం. తద్వారా అతడు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 14 నెలల తర్వాత ఈ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన హిట్‌మ్యాన్.. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్లు అయి నిరాశపరిచినా భారత్‌కు అత్యవసరమైన పరిస్థితుల్లో తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడు. ఈ మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా రోహిత్ సాధించిన రికార్డుల జాబితాను ఇక్కడ చూద్దాం.
ప్రపంచంలో మేటి..
టీ20 క్రికెట్లో రోహిత్‌కు ఇది ఐదో శతకం కాగా ఈ ఫార్మాట్లో ఇన్ని శతకాలు చేసిన తొలి బ్యాటర్ హిట్‌మ్యానే. ఈ జాబితాలో రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు నాలుగు శతకాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బాబర్ ఆజమ్ మూడు సెంచరీలతో నాలుగో స్థానంలో నిలిచాడు.
కోహ్లీ రికార్డు ఖతం..
అఫ్గాన్‌తో మ్యాచ్‌లో భాగంగా ఆ జట్టు పేసర్ ఫరీద్ అహ్మద్ విజృంభిడచంతో ఐదు ఓవర్లలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 22 పరుగులతో ఉన్న టీమిండియాను తన సెంచరీతో గట్టెక్కించిన రోహిత్ శర్మ.. భారత జట్టు తరఫున టీ20లలో సారథిగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో బెంగళూరు మ్యాచ్‌కు ముందు వరకూ విరాట్ కోహ్లీ 1,570 పరుగులతో అగ్రస్థానంలో ఉండేవాడు. తాజాగా రోహిత్ (1,647) అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ధోని (1,112) మూడో స్థానంలో ఉన్నాడు.
🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD
— BCCI (@BCCI) January 17, 2024
నాలుగో అత్యధిక స్కోరు..
ఈ మ్యాచ్‌లో రోహిత్.. 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్.. 126 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా.. రుతురాజ్ (123), విరాట్ కోహ్లీ (122) లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ నలుగురూ నాటౌట్‌గానే ఉండటం గమనార్హం.
రింకూతో రికార్డు భాగస్వామ్యం..
బెంగళూరులో రింకూ సింగ్‌తో కలిసి రోహిత్ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 90 బంతుల్లోనే ఈ జోడీ 190 పరుగుల భారీ పార్ట్‌నర్‌షిప్‌ను నమోదుచేసింది. భారత్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అంతకుముందు 2022లో సంజూ శాంసన్ – దీపక్ హుడాలు ఐర్లాండ్‌పై 176 పరుగులు నమోదు చేయడమే ఇప్పటివరకూ హయ్యస్ట్.
సిక్సర్ల రికార్డు..
తన సూపర్ ఇన్నింగ్స్‌లో రోహిత్.. 8 సిక్సర్లు బాదాడు. తద్వారా టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు. మోర్గాన్.. 86 సిక్సర్లు కొట్టగా.. రోహిత్ ఖాతాలో 90 సిక్సర్లున్నాయి. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో కూడా రోహిత్‌దే అగ్రస్థానం. 151 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. ఇప్పటివరకూ 190 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ (కివీస్ – 173), ఆరోన్ ఫించ్ (ఆసీస్ – 125), క్రిస్ గేల్ (విండీస్ – 125) లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.