జకర్తా: సీజన్ ఆరంభంలో వరుసగా రెండు టోర్నీల్లోనూ నిరాశపరిచిన భారత షట్లర్లు మరో కీలక టోర్నీకి సిద్ధమయ్యారు. గతవారం స్వదేశంలో ముగిసిన ఇండియా ఓపెన్‌లో కనీసం క్వార్టర్స్ దాటలేకపోయిన మన షట్లర్లు.. మంగళవారం నుంచి మొదలుకాబోయే ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తొలి రౌండ్లోనే కఠిన ప్రత్యర్థులను ఎదుర్కోనున్న మన ప్లేయర్లు.. ఏ మేరకు సత్తాచాటుతారనేది ఆసక్తికరం. పురుషుల సింగిల్స్‌లో సీనియర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి, లక్ష్యసేన్‌తో పాటు యువ సంచలనం అయూశ్ శెట్టి బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక బన్సోద్, తన్వి శర్మ, మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల, తనీషా క్రాస్టో సత్తాచాటాలని భావిస్తున్నారు.