సింధు శుభారంభం.. లక్ష్య, శ్రీకాంత్ పరాజయం
ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.
జకార్తా : ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 25-23, 21-16తో థాయిలాండ్‌కు చెందిన బుసానన్ ఓంగ్బామ్రుంగ్ఫాన్ పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో మాళవిక బన్సోద్ 12-21, 20-21తో ఏడో సీడ్ పొర్న్పావీ చోచువాంగ్ (థాయిలాండ్) చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్‌లో భారీ అంచనాలున్న లక్ష్యసేన్ 19-21, 16-21తో స్థానిక ఆటగాడు అల్వి ఫర్హాన్ చేతిలో వరుస గేమ్స్‌లో చిత్తయ్యాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 19-21, 15-21తో జపాన్ షట్లర్ యుషి తనకా చేతిలో ఓడి వెనుదిరిగాడు. డబుల్స్‌లో హరిహరన్ – అర్జున్ జోడీ 21-18, 21-10తో మలేషియా ద్వయం నూర్ మహ్మద్ అజ్రీన్ అయూబ్ – టాన్ వీ కియాంగ్‌ను చిత్తు చేసి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. కానీ మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ, మిక్స్‌డ్‌లో ధ్రవ్-తనీషా జంటలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

