జకర్తా: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ జోడీ 21-16, 21-15తో చెన్ జి రే- లిన్ యు చె (చైనా)ను చిత్తు చేసింది.
ప్రపంచ 19వ ర్యాంకు తనీషా జంట 21-6, 21-14తో ఒర్నిక-సుకిత (థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది.