పారిస్ : త్వరలో మొదలుకాబోయే ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు నిర్వహిస్తున్న అర్హత పోటీలలో భారత్‌కు చుక్కెదురైంది. సింగిల్స్ విభాగంలో భారత ఆశలు మోస్తున్న సుమిత్ నాగల్.. మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయాడు.
క్వాలిఫయింగ్ రౌండ్స్ లో భాగంగా బుధవారం జరిగిన రెండో రౌండ్లో నాగల్.. 2-6, 4-6తో జురిజ్ రొడియొనొవ్(ఆస్ట్రియా) చేతిలో ఓడటంతో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విభాగాల్లో భారత ప్రాతినిధ్యం లేకుండా పోయింది.