Shaurya Bawa | ఢిల్లీ: ప్రపంచ జూనియర్ స్కాష్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు శౌర్య బవ కాంస్యం గెలిచాడు. హోస్టన్ (అమెరికా) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా బుధవారం ముగిసిన సెమీఫైనల్స్‌లో శౌర్య 0-3 (5-11, 5-11, 9-11)తో మహ్మద్ జకారియా (ఈజిప్టు) చేతిలో ఓడాడు.
2014లో ఖుష్ కుమార్ తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరిన రెండో ప్లేయర్‌గా నిలిచిన శౌర్య.. కీలక పోరులో నిరాశపరిచాడు.