బెల్ఫాస్ట్: రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు గాను ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాభవం ఎదురవగా.. ఆదివారం మెన్ ఇన్ బ్లూ ఆతిథ్య జట్టుతో రెండో టీ20 ఆడనుంది. ఫస్ట్ మ్యాచ్‌లో అంతగా అనుభవం లేని ఐరిష్ బౌలర్ల ధాటికి కుదేలైన భారత బ్యాటింగ్ లైనప్.. ఈ పోరులో సత్తాచాటితేనే సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్‌తో రాబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఇది సవాల్‌తో కూడుకున్నదే. ఈ మ్యాచ్‌లో అయినా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి టీమ్ మేనేజ్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో? లేదో? చూడాలి.