e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా?

దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా?

దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా?

భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌ ఎవరు అంటే చాలా మంది టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేదా భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పేరు చెబుతారు. కానీ అది వీరిద్దరూ కాదు.భారత క్రికెటర్లు బీసీసీఐ నుంచి భారీ మొత్తంలో వార్షిక వేతనాన్ని అందుకుంటారు. దీంతో పాటు ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో ఎక్కువగానే సంపాదిస్తారు. భారత్‌లో టాప్‌-5 రిచ్‌ క్రికెటర్లు ఎవరో ఓసారి లుక్కేద్దాం!

సచిన్‌ టెండూల్కర్‌

భారత మాజీ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. టెండూల్కర్‌ మొత్తం ఆస్తి 1090కోట్లు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ పలు బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు.

మహేంద్ర సింగ్‌ ధోనీ


కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ 767 కోట్లతో ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

విరాట్‌ కోహ్లీ


భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రూ.638 కోట్లతో ప్రపంచంలోనే మూడో సంపన్న క్రికెటర్‌గా అవతరించాడు. కోహ్లీకి సొంత ఫ్యాషన్‌ బ్రాండ్‌ రాన్‌, వన్‌8(ప్యూమాతో భాగస్వామ్యం) ఉన్నాయి. కోహ్లీకి 20కి పైగా బ్రాండ్లకు ప్రచార కర్తగా ఉన్నాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నుంచి కోహ్లీ ఏడాదికి రూ.17 కోట్లు అందుకుంటున్నట్లు తెలిసింది.

వీరేంద్ర సెహ్వాగ్‌


భారత మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సంపద విలువ దాదాపు రూ.277 కోట్లుగా ఉంది.
జాబితాలో సెహ్వాగ్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు.

యువరాజ్‌ సింగ్‌


టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌, 2011 ప్రపంచకప్‌ వీరుడు యువరాజ్‌ సింగ్‌ సంపన్న క్రికెటర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. యువీ ఆస్తి విలువ సుమారు 245 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా?

ట్రెండింగ్‌

Advertisement