రిఫా (బహ్రెయిన్): ఏషియా యూత్ గేమ్స్‌లో భారత యువ అథ్లెట్ పలాష్ మండల్ కాంస్యంతో సత్తాచాటాడు. బాయ్స్ 5,000 మీటర్ల రేస్‌వాక్ ఫైనల్లో అతడు లక్ష్యాన్ని 24 నిమిషాల 48.92 సెకన్లలో ఛేదించి కాంస్యం సొంతం చేసుకున్నాడు. రేస్‌వాక్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. అంతకుముందు రంజన యాదవ్ కూడా రజతం గెలిచింది.