బ్యాంకాక్: ఏషియన్ అండర్-19 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రత్యర్థులను చిత్తు చేయడం ద్వారా పది మంది ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇందులో ఏడుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు.
నిశ(54కి), ముస్కాన్(57కి), విని(60కి), నిశా(65కి), ఆర్తీకుమారి(75కి), పార్చి తోకాస్(80+కి), మౌసమ్ సుహాగ్(65కి) తుదిపోరుకు అర్హత సాధించి కనీసం రజతం ఖాయం చేసుకోగా, రాహుల్ కుందు (75కి), హేమంత్ సాంగ్వాన్(90కి), క్రితిక(80కి) ఫైనల్లోకి ప్రవేశించారు. వేర్వేరు వయసు విభాగాల్లో భారత్ నుంచి మొత్తం 40 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.