అమ్మాన్(జోర్డాన్): ఏషియన్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత పతక జోరు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన గురువారం జరిగిన వేర్వేరు బౌట్లలో భారత బాక్సర్లు నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుని ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచారు. టోర్నీలో భారత్‌కు 15 స్వర్ణాలు సహా 6 రజతాలు, 22 కాంస్య పతకాలు దక్కాయి.
కజకిస్థాన్ అగ్రస్థానంలో నిలువగా, ఉజ్బెకిస్థాన్‌కు మూడో స్థానం లభించింది. బాలికల అండర్-17 విభాగంలో కుశి చాంద్(46కి), అహనశర్మ(50కి), జన్నత్(54కి), అన్శిక(80+కి) ప్రత్యర్థులపై విజయాలతో పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. భారత యువ బాక్సర్లు ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తే భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సొంతమవుతాయని బాక్సింగ్ కమిటీ తాత్కాలిక చైర్మన్ అజయ్‌సింగ్ పేర్కొన్నారు.