Tokyo Olympics: డిస్కస్ త్రో ఫైనల్‌కు క్వాలిఫై అయిన కమల్‌ప్రీత్ కౌర్
ఇండియన్ డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది. శనివారం ఉదయం జరిగిన క్వాలిఫికేషన్లో ఆమె 64 మీటర్ల దూరం విసిరి.. ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది.

టోక్యో: ఇండియన్ డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది. శనివారం ఉదయం జరిగిన క్వాలిఫికేషన్లో ఆమె 64 మీటర్ల దూరం విసిరి.. ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. అంతేకాదు మొత్తం గ్రూప్ ఎ, గ్రూప్ బి క్వాలిఫికేషన్లలో కలిపి కమల్‌ప్రీత్ విసిరిందే రెండో అత్యధిక దూరం కావడం విశేషం. తొలి ప్రయత్నంలో 60.59 మీటర్ల దూరమే విసిరిన ఆమె.. రెండో ప్రయత్నంలో ఏకంగా 63.97 మీటర్లు, మూడో ప్రయత్నంలో 64 మీటర్ల మార్క్ అందుకుంది. ఇక ఈ ఈవెంట్లోనే గ్రూప్ ఎలో పార్టిసిపేట్ చేసిన మరో ఇండియన్ డిస్కస్ త్రోయర్ సీమా పూనియా 60.57 మీటర్ల దూరమే విసిరి ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మొత్తంగా ఆమె 16వ స్థానంలో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

