హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్‌లో తొలి రగ్బీ ప్రీమియర్ లీగ్‌కు వేళయైంది. ఈ నెలలో మొదలుకానున్న లీగ్ ఆధారిత రగ్బీ ఎస్ టోర్నీలో వివిధ దేశాల ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లతో కలిసి తమ ప్రతిభకు మెరుగులు అద్దుకునేందుకు దేశ రగ్బీ ఆటగాళ్లకు మంచి అవకాశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
జీఎంఆర్ రగ్బీ ప్రీమియర్ లీగ్ కోసం ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్(ఐఆర్‌ఎఫ్‌యూ)తో క్యాప్‌జెమిని సంస్థ తమ భాగస్వామ్యాన్ని అందించనుంది. రగ్బీ 7ఎస్ పార్మాట్లో జరిగే ఈ లీగ్‌లో ప్లేయర్ల ప్రదర్శన మెరుగు పర్చడం, ఆటగాళ్ల ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడంలో ఈ సంస్థ సహకరించనుంది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ అధ్యక్షుడు రాహుల్ బోస్, జీఎంఆర్ స్పోర్ట్స్ సీఈవో సత్యం త్రివేది, క్యాప్‌జెమిని సీఈవో అశ్విన్ పాల్గొన్నారు.