గాంధీనగర్: ప్రపంచ జూనియర్ బాలికల చెస్ చాంపియన్షిప్లో భారత్కు చెందిన దివ్య దేశ్ముఖ్ విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఆఖరి రౌండ్ పోరులో 18 ఏండ్ల దివ్య..బల్గేరియాకు చెందిన బెలోస్లవా క్రస్టెవా(బల్గేరియా)పై అద్భుత విజయం సాధించింది. దీంతో టోర్నీలో మొత్తం 11 పాయింట్లకు గాను ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య 10 పాయింట్లు దక్కించుకుని చాంపియన్షిప్ దక్కించుకుంది.
మరియమ్ మిక్చియాన్(అర్మేనియా, 9.5), అయాన్ అల్లావెర్దియెవా (అజర్బైజాన్,8.5) వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. ఓపెన్ విభాగంలో నోగర్బెక్ కజిబెక్ (కజకిస్థాన్) విజేతగా నిలిచాడు.