ఢాకా: వచ్చేనెలలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) ద్వైపాక్షిక సిరీస్‌లపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా టీమ్ఇండియా బంగ్లాదేశ్ వెళ్తుందా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
ఇదే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ‘మేం బీసీసీఐతో చర్చిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా భారత్‌తో సిరీస్ ఉంటుంది. వాళ్లు (బీసీసీఐ) వారి ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నారు’ అని చెప్పారు.