లెవన్ (బెల్జియం) : భారత యువ టెన్నిస్ ప్లేయర్ అన్మోల్ ఖర్బ్ తన తొలి సీనియర్ టోర్నీలోనే సంచలన ప్రదర్శన చేసింది. బెల్జియం వేదికగా జరుగుతున్న బెల్జియన్ ఇంటర్నేషనల్ 2024 టోర్నీలో భాగంగా తొలి రౌండ్లో 17 ఏండ్ల అన్మోల్.. 24-22, 12-21, 21-10తో ప్రపంచ 80వ ర్యాంకర్ అయిన అమలి స్కూల్జ్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేసింది. సీనియర్ టెన్నిస్‌లో 222వ ర్యాంకు కలిగిన అన్మోల్.. సీనియర్ విభాగంలో ఆడుతూ తొలి మ్యాచ్‌లోనే తనకంటే మెరుగైన ర్యాంకర్‌ను మట్టికరిపించి ముందంజ వేయడం గమనార్హం.