ఢిల్లీ: అజర్బైజాన్ లోని బాకులో జరిగిన అజర్బైజాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్లు మెరిశారు. మిక్స్డ్ డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన సాత్విక్ రెడ్డి, రాధికా శర్మ (హర్యానా) జోడీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది.
మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్, రాధా.. 24-22, 10-21, 24-22తో మూడో సీడ్ మిహాజిలొ, అంజెల (సెర్బియా) పై గెలిచారు. రాధికా.. భారత మహిళా బ్యాడ్మింటన్ యువ సంచలనం తన్వి శర్మ సోదరి. ఇక సింగిల్స్ విభాగంలో ఇటీవలే థాయ్‌లాండ్ మాస్టర్స్ గెలిచిన దేవికా.. 21-10, 21-13తో భారత్‌కే చెందిన నవ్యపై గెలిచి టైటిల్ నెగ్గింది.