సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత యువ షట్లర్ మితున్ మంజునాథ్ సంచలన విజయం సాధించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్లో మంజునాథ్ 21-19, 21-19తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కీన్ యి లోహ్(సింగపూర్)ను మట్టికరిపించాడు. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో 50వ ర్యాంక్‌లో కొనసాగుతున్న మిథున్..తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న కీన్‌ను వరుస గేముల్లో ఓడించి టోర్నీలో ముందంజ వేశాడు.
మరోవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21-18, 21-13తో భారత్‌కే చెందిన అశ్మితా చాలిహాపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21-18, 16-21, 21-15తో లీ చీక్ యు(హాంకాంగ్)పై గెలిచాడు. మరో పోరులో కిడాంబి శ్రీకాంత్ 21-18, 21-7తో కెంటా నిషిమోటో(జపాన్)కు ఝలక్ ఇచ్చాడు.