లిమా (పెరూ): ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత యువ షూటర్ ఖుషీ కపూర్ కాంస్యం నెగ్గింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (3పీ) ఫైనల్లో ఆమె.. 447.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది.
నార్వే అమ్మాయిలు సిన్నొవె బెర్గ్ (458.4), కరోలిన్ లండ్ (458.3) వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకున్నారు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి దాకా 10 స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలు సాధించి 15 పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.