హైదరాబాద్, ఆట ప్రతినిధి: చైనా వేదికగా బుధవారం నుంచి మొదలయే ఐటీటీఎఫ్-ఏటీటీయూ ఆసియా కప్ టోర్నీకి భారత యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ ఎంపికయ్యాడు. హైనాన్ ఫ్రావిన్స్‌లో ఈనెల 8వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో స్నేహిత్..సింగిల్స్‌లో బరిలోకి దిగనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 32 మంది టాప్ ర్యాంకింగ్ ప్లేయర్లతో స్నేహిత్ పోటీపడనున్నాడు.
గ్రూపు దశలో వరల్డ్‌నంబర్-2 లిన్ షిండాన్(చైనా), కుయి గువాన్ హాంగ్(తైవాన్), అన్బుదలజీజ్ బు షుల్భుయ్(సౌదీఅరేబియా)తో స్నేహిత్ తలపడుతాడు. ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచిన ప్లేయర్లు మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తారు. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లతో పోటీ పడే అవకాశం లభించడం సంతోషంగా ఉందని యువ ప్యాడ్లర్ పేర్కొన్నాడు.