ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. అర్జున్ వరుసగా ఆరో విజయంతో సోమవారం జరిగిన పోరులో భారత్ 3-1తో రష్యాను ఓడించింది. టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని అర్జున్..సుగిరోవ్ సనాన్పై అద్భుత విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత్ 2.5-1.5తో అర్మేనియాపై గెలిచింది.