న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం (India Won)చేసుకున్నది ఇండియా. ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 121 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా.. అయిదో రోజు తొలి సెషన్లో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 58 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. టెస్టుల్లో రాహుల్ 21వ అర్థ సెంచరీ నమోదు చేశాడు. 102 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ కొట్టాడు.
ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 518 రన్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్ల కాస్త మెరుగ్గా ఆడాడు. క్యాంప్‌బెల్, హోప్‌లు సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లోనూ విండీస్ బ్యాటర్లు కీలక రన్స్ సాధించారు. దీంతో విండీస్ 120 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
A victory to savour! 👌
KL Rahul provides the finishing touches as #TeamIndia seal the win in Delhi and take the series 2⃣-0⃣ 👏
Scorecard ▶ https://t.co/GYLslRyLf8#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/X4iDpGKbTd
— BCCI (@BCCI) October 14, 2025
ఈ విక్టరీతో భారత్‌కు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్లో 61.9 శాతం పాయింట్లు జతకలిశాయి. అయినా ప్రస్తుతం భారత జట్టు మూడవ స్థానంలో ఉన్నది.