కజన్: రష్యా లోని కజన్ నగరం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ గేమ్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు కాంస్యం గెలుచుకుని పతకాల పట్టికలో బోణీ కొట్టింది. టీటీ టీమ్ ఈవెంట్లో శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో భారత్.. 1-3తో చైనా చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో యషిని గెలిచినా ఆ తర్వాత బౌస్య, మౌమితా చేతులెత్తేయడంతో భారత్ కాంస్యానికి పరిమితమైంది. కాంస్యం సాధించిన భారత జట్టుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. కాగా ఇవే క్రీడల్లో భారత పురుషుల జట్టు ఐదో స్థానంలో నిలిచింది.