టోక్యో: ఒలింపిక్స్‌లో భారత హాకీ అమ్మాయిలు ( Women’s Hockey ) అద్భుతంగా పోరాడారు. అసలు ఆశలే లేని స్థితి నుంచి ఏకంగా బ్రాంజ్ మెడల్ ఆడే స్థాయికి చేరారు. మెడల్ మ్యాచ్‌లోనూ బ్రిటన్‌పై చాలా వరకూ పైచేయి సాధించింది. ఒక దశలో 0-2 గోల్స్‌తో వెనుకబడినా.. తర్వాత 3-2 లీడ్‌లోకి దూసుకెళ్లి మెడల్ సాధించేలానే కనిపించారు. కానీ చివరి క్వార్టర్లోతడబడి తృటిలో మెడల్ చేజార్చుకున్నారు. తమ కల చెదరడంతో ఈ ఓటమిని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. దుఃఖాన్ని ఆపుకోలేక గ్రౌండ్‌లోనే బోరున ఏడ్చేశారు. వాళ్లను టీమ్ కోచ్‌తోపాటు ప్రత్యర్థి బ్రిటన్ ప్లేయర్స్ కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మెడల్ కోసం వాళ్లు ఎంతగా పరితపించారో అర్థమవుతుంది.
They are crying
— Mukesh kumar singh 🇮🇳🕉️हर हर महादेव🕉 (@JaiHindNamo) August 6, 2021
I'm crying
But you'd made this country so proud that we can't even tell
World's Top 4th Team
It's our Women's Team 💙🇮🇳
Medal nahi aaya lekin छाती चौड़ा हो गया हमारा #womenhockeyindia #CheerForIndia
💔#GBRvIND #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #Hockey pic.twitter.com/fviIMCOi2e