ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగం కానున్నది. ఇటీవలే స్వదేశంలో శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్‌లో తన స్పిన్‌తో సత్తాచాటిన వైష్ణవి.. డబ్ల్యూపీఎల్-4లో ముంబై ఇండియన్స్‌కు ఆడనుంది. వికెట్ కీపర్ బ్యాటర్ జి. కమిలిని గాయంతో టోర్నీ నుంచి వైదొలగడంతో ఆమె స్థానాన్ని వైష్ణవి భర్తీ చేయనుంది.