అంటాల్య: పారిస్ ఒలింపిక్స్‌లో కోటా దక్కించుకునేందుకు ఆఖరి అవకాశమైన ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత మహిళల రికర్వ్ జట్టు నిరాశపరిచింది. టర్కీలోని అంటాల్య వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో దీపికా కుమారి, భజన్ కౌర్, అంకితా భకత్‌తో కూడిన భారత జట్టు ప్రి క్వార్టర్స్‌లో 3-5తో ఉక్రెయిన్ చేతిలో ఓటమిపాలైంది. ఉక్రెయిన్‌తో ఓడినా భారత్‌కు ఒలింపిక్స్‌లో బెర్తు సాధించేందుకు మరో అవకాశముంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న భారత్.. ర్యాంకుల ఆధారంగా విశ్వక్రీడల్లో బరిలోకి దిగే చాన్స్ ఉంది.