ఆస్ట్రేలియాకు షాక్.. 26 వరుస విజయాల రికార్డుకు టీమిండియా బ్రేక్

మెక్కే: ఇండియన్ వుమెన్స్ టీమ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. వాళ్ల 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆదివారం ఆ టీమ్‌తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచింది. అంతేకాదు వన్డేల్లో ఇండియన్ వుమెన్స్ టీమ్ చేజ్ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 3 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. అయితే ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ ఎగరేసుకుపోయింది. ఇక ఈ నెల 30 నుంచి ఈ రెండు టీమ్స్ ఏకైక పింక్ బాల్ టెస్ట్‌లో తలపడనున్నాయి.
రెండో వన్డేలోనూ గెలిచేలా కనిపించిన ఇండియన్ వుమెన్స్ టీమ్.. చివరి బంతికి ఝులన్ గోస్వామి నోబాల్ వేయడంతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే మూడో వన్డేలో మాత్రం అలాంటి తప్పిదానికి తావివ్వకుండా జాగ్రత్తగా ఆడారు. షెఫాలీ వర్మ (91 బంతుల్లో 56), యాస్తికా భాటియా (69 బంతుల్లో 64) చేజింగ్‌లో రాణించారు. దీప్తి శర్మ (30 బంతుల్లో 31), స్నేహ్ రాణా (27 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ కూడా విజయంలో కీలకపాత్ర పోషించాయి. మహిళల క్రికెట్ గ్రేటెస్ట్ చేజింగ్‌లలో ఒకటిగా దీనిని అభివర్ణించవచ్చు.
That is it!⁰⁰⚡️
— BCCI Women (@BCCIWomen) September 26, 2021
Came agonisingly close in the 2nd ODI but have crossed the finish line NOW. #TeamIndia win the 3rd ODI by 2 wickets after a thrilling chase and with it end Australia’s marathon 26-match unbeaten streak. #AUSvIND pic.twitter.com/4b7QJxvX5w
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

