పారిస్: భారత టెన్నిస్ వెటరన్ రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించాడు. భారత్ తరఫున తన చివరి మ్యాచ్‌ను ఆడేసినట్టు బోపన్న తెలిపాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న-శ్రీరామ్ బాలాజీ.. 5-7, 2-6తో రోజర్-మొన్ఫిల్స్ (ఫ్రెంచ్) చేతిలో ఓడి ఇంటిబాట పట్టారు. మ్యాచ్ అనంతరం బోపన్న మాట్లాడుతూ.. ‘దేశం తరఫున ఇదే నా చివరి మ్యాచ్. నేను ఎక్కడున్నాను? అనేదానిపై నాకు పూర్తి అవగాహన వచ్చింది’ అని అన్నాడు. దేశం తరఫున రిటైర్మెంట్ ప్రకటించినా ప్రొఫెషనల్ గ్రాండ్‌స్లామ్, ఏటీపీ టోర్నీలలో మాత్రం కొనసాగనున్నాడు.