ATP 250 | ఢిల్లీ: చైనా వేదికగా జరుగుతున్న రెండు ఏటీపీ 250 టోర్నీలలో భారత టెన్నిస్ ఆటగాళ్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఏటీపీ 250 చెంగ్డూ ఓపెన్ డబుల్స్ సెమీస్‌లో భారత టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ, తన ఫ్రెం చ్ సహచరుడు అల్బానో ఒలివెట్టి జోడీ ఫైనల్స్‌కు చేరింది.
సెమీస్‌లో ఈ ఇండో-ఫ్రెంచ్ ద్వయం.. 6-3, 7-6తో ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా), రఫెల్ మా టోస్ (బ్రెజిల్)ను ఓడించింది. ఇక హాంగ్జో ఓపెన్‌లో మరో భారత జోడీ జీవన్- విజయ్ 0-6, 6-2, 10-4తో మూడో సీడ్ బెహర్(ఉరుగ్వే), రాబర్ట్ (యూఎస్ఏ)ను చిత్తు చేసింది.