INDW vs PAKW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టిన భారత్ (Team India) రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. కొలంబో వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది టీమిండియా. అయితే.. ఆసియా కప్ ట్రోఫీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దాయాది టీమ్ క్రికెటర్లతో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన హ్యాండ్‌షేక్ చేస్తుందా? లేదా? అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఏసీసీ, పీసీబీ అధ్యక్షుడైన మొహ్సిన్ నఖ్వీ తీరుతో ఆగ్రహంగా ఉన్న బీసీసీఐ (BCCI) ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పురుషల జట్టు మాదిరిగానే పాక్ ప్లేయర్లతో ‘నో షేక్‌హ్యాండ్’ విధానం పాటించాలని సూచించింది.
‘శత్రుదేశాల విషయంలో భారత ప్రభుత్వం ఆదేశాలను శిరసావహించే బీసీసీఐ వరల్డ్ కప్‌లోనూ పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనం చేయొద్దని నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరుగబోయే మ్యాచ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌తో కరచాలనం.. ఫొటోషూట్‌ను కూడా భారత కెప్టెన్ నిరాకరిస్తుంది. ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు దాయాది టీమ్ విషయంలో అనుసరించిన విధానాన్నే వరల్డ్ కప్‌లో మహిళల టీమ్ పాటించనుంది’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించినట్టు పీటీఐ కథనం పేర్కొంది.
A lot of laughs 😁
A lot of takes 🎬
The #WomenInBlue have arrived in Colombo 🇱🇰#TeamIndia | #CWC25 pic.twitter.com/zlYf7cTt3D
— BCCI Women (@BCCIWomen) October 2, 2025
ప్రపంచ కప్ తొలి పోరులో కోహోస్ట్ శ్రీలంకపై విజయంతో భారత జట్టు శుభారంభం చేయగా.. బంగ్లాదేశ్ చేతిలో పాక్ దారుణ ఓటమి చవిచూసింది. దాంతో.. లీగ్ దశలో ముందంజ వేయాలంటే ఈ మ్యాచ్ ఫాతిమా సనా జట్టుకు చాలా కీలకం. కానీ, ఫామ్‌లో ఉన్న టీమిండియా.. పాక్ ఆశల్ని కల్లలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకూ వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థులు 11 పర్యాయాలు తలపడగా.. భారత్ అన్నింటా విజయాలతో ఆధిపత్యం చెలాయించింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న ఆ దేశంతో ఆటలే కాదు ఒప్పందాల విషయంలోనూ కఠిన వైఖరినే ఎంచుకుంది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో టీమిండియా ఆటగాళ్లు మూడు మ్యాచుల్లోనూ పాక్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్ చేయలేదు. ఫైనల్లో పాక్‌పై 5 వికెట్ల విజయంలో సూర్యకుమార్ యాదవ్ సేన జయభేరి మోగించింది.
Big Breaking 🚨🚨
Team India refuses to accept the Asia Cup 2025 Trophy 🏆 from Pakistan interior minister and ACC Chairman Mohsin Naqvi.
Someone just picked up the trophy and walked off the ground.
Another Embarrassing Moment for 🇵🇰
Video 📷#INDvsPAK #AsiaCupFinal #Tilak pic.twitter.com/h4CrRZgcUF
— Globally Pop (@GloballyPop) September 28, 2025
ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడి హోదాలో మొహ్నిన్ నఖ్వీ విజేతలకు ట్రోఫీ ప్రదానం చేసేందుకు వచ్చాడు. కానీ, పాక్ ప్రభుత్వంలో మంత్రి అయిన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా క్రికెటర్లు ఇష్టపడలేదు. తమకు యూఏఈ క్రికెట్ చీఫ్ ట్రోఫీని అందించాలని వారు కోరారు. కానీ, నఖ్వీ మాత్రం అందుకు అంగీకరించలేదు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తనతో పాటు ట్రోఫీని తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతడిపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.