ముంబై: యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో టెస్టులో ఆడించాలని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో శనివారం వెంగసర్కార్ మాట్లాడుతూ.. ‘ఓ బౌలర్‌ను తగ్గించుకునైనా.. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలి. ఆరో ఆటగాడిగా హనుమ విహారి కంటే.. సూర్యకుమార్‌ను తీసుకోవడమే మంచిది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రస్తుత జట్టులో అతడు సరిగ్గా సరిపోతాడు. జట్టులోని అత్యుత్తమ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఎందుకు చోటు దక్కడం లేదో అర్థం కావడం లేదు’ అని అన్నాడు.