Emerging Asia Cup | కొలంబో: ఎమర్జింగ్ కప్‌లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకున్న యువ భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-‘బి’లో భాగంగా సోమవారం జరిగిన పోరులో భారత్-‘ఎ’9 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. మొదట నేపాల్ 39.2 ఓవర్లకు 167 పరుగులకు ఆలౌటైంది.
రోహిత్ (65) టాప్ స్కోరర్. మన బౌలర్లలో నిషాంత్ 4, రాజ్వర్ధన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు అభిషేక్ శర్మ (87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), సాయి సుదర్శన్ (58 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ 22.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది.