రాజ్‌గిర్ : బీహార్ ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్ హాకీలో భారత జట్టు బోణీ కొట్టింది. పూల్ ఏలో భాగంగా రాజ్‌గిర్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్.. 4-3తో చైనాపై విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ 18వ నిమిషంలో తొలి గోల్ కొట్టగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్ (20వ ని., 33వ ని., 47వ ని.) గోల్స్‌తో విజృంభించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
చైనా ఆటగాళ్లలో షిహావొ (12వ ని.), బెన్హయ్ (35వ ని.), జిషెంగ్ (42వ ని.) గోల్స్ చేశారు. తొలి క్వార్టర్లో 0-1తో వెనుకబడ్డ భారత్.. రెండో క్వార్టర్స్ మొదలయ్యాక రెండు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టింది. హర్మన్‌ప్రీత్ వరుసగా పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. చివరి క్వార్టర్ వచ్చేసరికి ఇరుజట్లు 3-3తో సమంగా ఉండగా 47వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్ గోల్ చేసి టీమ్ఇండియాకు విజయాన్ని అందించాడు.