దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో పరాజయం పాలైన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ఇండియాకు భారీ జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు గానూ రోహిత్ సేన మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించింది.
గిల్‌కు 115 శాతం ఫైన్
శుభ్‌మన్ గిల్‌కు అదనపు జరిమానా పడింది. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ ఔటైన తర్వాత అంపైర్ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకుగానూ 15 శాతం కోత విధించారు. గ్రీన్ పట్టిన సందేహాస్పద క్యాచ్‌కు పెవిలియన్ చేరిన గిల్ దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.నియమావళిని ఉల్లంఘించినందుకు గిల్‌కు అదనపు జరిమానా విధించింది.