చెన్నై: ఎస్‌డీఏటీ స్కాష్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్.. 3-0తో దక్షిణాఫ్రికాను ఓడించి సెమీస్ బెర్తును ఖరారుచేసుకుంది. సీనియర్ ప్లేయర్ జ్యోత్స్న చిన్నప్పతో పాటు అభయ్ సింగ్, అన్హత్ తమ ప్రత్యర్థులపై అలవోక విజయాలు సాధించారు. నేడు జరుగబోయే సెమీస్‌లో భారత్.. డిఫెండింగ్ చాంపియన్ ఈజిప్ట్‌తో తలపడనుంది.