U19 World Cup | ఢిల్లీ: వచ్చే ఏడాది కౌలాలంపూర్ (మలేషియా) వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళా సెలక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న టీమ్ఇండియాకు నిక్కీ ప్రసాద్ సారథిగా వ్యవహరించనుండగా సానికా చాక్లేను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
15 మంది జట్టు సభ్యులలో తెలుగు రాష్ర్టాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు చోటు దక్కించుకున్నారు. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతికి జట్టులో స్థానం లభించగా విశాఖపట్నం అమ్మాయి ఎండీ షబ్నమ్ సైతం చోటు సంపాదించింది. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో భారత్.. జనవరి 19న వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌తో టైటిల్ వేటను ఆరంభించనుంది.
నిక్కీ ప్రసాద్ (కెప్టెన్), సానికా చాక్లే (వైస్ కెప్టెన్), జి. త్రిష, కమిలిని (వికెట్ కీపర్), భవిక అహిరె (వికెట్ కీపర్), ఈశ్వరి అవసరె, మిథిలా వినోద్, జోషిత, సోనమ్ యాదవ్, పరునికా సిసోడియా, కేసరి ధృతి, అయూషి శుక్లా, ఆనందిత కిషోర్, ఎండీ షబ్నమ్, ఎస్. వైష్ణవి స్టాండ్ బై ప్లేయర్లు: ఎస్.నంధన, జె. ఇరా, టి. ఆనంది