దుబాయ్: భారత టీ20 జట్టు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. టీ20లలో అతడు ఆస్ట్రేలియా బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో తన ఓపెనింగ్ పార్ట్నర్ అయిన ట్రావిస్ హెడ్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
అభిషేక్ ఖాతాలో 829 రేటింగ్ పాయింట్లుండగా హెడ్ 814 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో భారత్ నుంచి మొదటి ర్యాంకు సాధించినవారిలో గంభీర్, కోహ్లీ, సూర్యకుమార్ తర్వాత శర్మ నాలుగోవాడు. ఇక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జడేజా అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణిస్తున్న జడ్డూ.. 422 రేటింగ్ పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.