Asian Games 2026 : భారత సర్ఫర్లు సంచలనం సృష్టించారు. తొలిసారి ఆసియా క్రీడ(Asian Games)ల బెర్తు కైవసం చేసుకున్నారు. యువకెరటం కిశోర్ కుమార్ (Kishore Kumar) అద్భుత ప్రదర్శనతో భారత పురుషుల, మహిళల జట్లు 2026లో జరుగబోయే ఆసియా క్రీడలకు అర్హత సాధించాయి.
మాల్దీవ్స్ వేదికగా జరిగిన ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్స్(Asian Surfing Championships 2024) అండర్ -18 విభాగంలో కిశోర్ అదరగొట్టాడు. హీట్ 2లో మూడో స్థానంలో నిలిచి కీలక పాయింట్లు సంపాదించి టీమ్‌కు ఆసియా క్రీడల బెర్తు ఖరారు చేశాడు. ‘సర్ఫర్ల ప్రదర్శనకు ధన్యవాదాలు. ఆసియా గేమ్స్ 2026 అర్హతకు అవసరమైన ర్యాంకింగ్ పాయింట్లను భారత పురుషుల, మహిళల జట్లు సాధించాయి’ అంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సాయ్(SAI) ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టింది.
Indian 🏄 Surfing team’s Asian Games 2026 spot confirmed ✅
Thanks to our Surfers’ performance, 🇮🇳#TeamIndia amassed the required ranking points to qualify for the Asiad with one quota each for Men and Women.#Cheer4Bharat@sfisurfing pic.twitter.com/l8S7ZCpsVQ
— SAI Media (@Media_SAI) August 24, 2024
అయితే.. కిశోర్ ఫైనల్ అవకాశం కోల్పోయినా కూడా మూడో ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. హీట్ 2లో అతడు 8.26 పాయింట్లు సాధించడం వల్ల భారత పురుషుల, మహిళల సర్ఫింగ్ జట్లు ఆసియా క్రీడలకు క్వాలిఫై అయ్యాయి.
ఈ పోటీల్లో జపాన్‌కు చెందిన తారో తకయ్ 14.50 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. చైనా సర్ఫర్ చెంగ్జెంగ్ వాంగ్ 10.0 పాయింట్లో రెండో స్థానం సాధించాడు. రెండేండ్ల తర్వాత జరుగబోయే ఈ ఆసియా క్రీడలకు జపాన్‌లోని ఐచి నగొయ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.