వాంటా(ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-19, 18-21, 15-21తో చో టీన్ చెన్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. గంటా 10 నిమిషాల పాటు సాగిన పోరులో 23 ఏండ్ల లక్ష్యసేన్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయాడు. తొలిగేమ్‌ను 21-19తో గెలిచిన లక్ష్యసేన్..వరుస గేముల్లో ప్రత్యర్థికి తలొగ్గి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.
మిగతా మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జ్ 17-21, 8-21తో జొనాథన్ క్రిస్టి(ఇండోనేషియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 15-21, 8-21తో రచనోక్ ఇటానోన్పై ఓడగా, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్ వేర్వేరు ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డ బుల్స్‌లో సతీశ్‌కుమార్, కరుణాకర్ జోడీతో పాటు మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ, స్వేతపర్ణ ద్వయం పోరాటం ముగిసింది.