Achanta Sharath Kamal | సింగపూర్: సింగపూర్ స్మాష్ టీటీ టోర్నీలో భారత స్టార్ ప్యాడ్లర్ ఆచంట శరత్‌కమల్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కమల్ 11-4, 11-8, 12-10తో ఒమర్ అస్సర్(ఈజిప్టు)పై అద్భుత విజయం సాధించాడు. తన(88ర్యాంక్) కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న అస్సర్(22)ను ఓడించి కమల్ ముందంజ వేశాడు. తొలి రెండు గేమ్‌లను అలవోకగా కైవసం చేసుకున్న ఈ సీనియర్ ప్యాడ్లర్‌కు మూడో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి దీటైన పోటీ ఎర్పడింది. క్వార్టర్స్‌లో ఫెలిక్స్ లెబ్రాన్(ఫ్రాన్స్)తో కమల్ తలపడుతాడు.