అహో.. గులాబీ బాల

- స్మృతి సూపర్ సెంచరీ
- భారత్ తొలి ఇన్నింగ్స్ 276/5
- ఆస్ట్రేలియాతో గులాబీ టెస్టు
గోల్డ్‌కోస్ట్: భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన కొత్త చరిత్ర లిఖించింది. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడమే లక్ష్యంగా ప్రత్యర్థిపై విరుచుకుపడింది. గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టు ఆడుతున్నది తొలిసారే అయినా..ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో మందన ఆకాశమే హద్దుగా చెలరేగింది. మందన (127; 22 ఫోర్లు, ఒక సిక్సర్) రికార్డు సెంచరీతో చెలరేగడంతో ఆసీస్‌తో గులాబీ పోరులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. వరుసగా రెండో రోజూ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడగా.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 132/1తో రెండో రోజు ఆట కొనసాగించిన మిథాలీ బృందం.. కంగారూ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో స్మృతి 170 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత మహిళల జట్టు తరఫున ఇదే తొలి శతకం కాగా.. గులాబీ టెస్టులో కూడా ఇదే మొదటిది. పూనమ్ రౌత్ (36) కెప్టెన్ మిథాలీ రాజ్ (30) ఫర్వాలేదనిపించగా.. యస్తిక భాటియా (19) ఆకట్టుకోలేకపోయింది. దీప్తి శర్మ (12), తానియా భాటియా (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో సోఫియా రెండు వికెట్లు పడగొట్టింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 276/5 (మందన 127, పూనమ్ 36; సోఫియా 2/28).
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ చేసిన తొలి భారత మహిళగా మందన రికార్డుల్లోకెక్కింది. గులాబీ టెస్టులో భారత్‌కిదే తొలి శతకం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

