Asian Athletics Championships | వెండి పతకం గెలిచిన భారత స్టార్ లాంగ్ జంపర్.. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు
Asian Athletics Championships : భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్(Murali Sreeshankar) అంచనాలను అందుకున్నాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్(Asian Athletics Championships 2023)లో పురుషుల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో అతను 8.37 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో, వచ్చే ఏడాది....
Asian Athletics Championships : భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్(Murali Sreeshankar) అంచనాలను అందుకున్నాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్(Asian Athletics Championships 2023)లో పురుషుల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో అతను 8.37 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో, వచ్చే ఏడాది పారిస్‌లో జరుగనున్న ఒలింపిక్స్(Paris Olympics 2024) పోటీలకు అర్హత సాధించాడు. మొదటి ప్రయత్నంలో శ్రీశంకర్ 8.10 మీటర్ల దూరం దూకాడు. మూడో ప్రయత్నంలో 8.12 మీటర్ల దూరం దూకిన అతను ఐదో ప్రయత్నంలో 8.37 మీటర్లతో రికార్డు సృష్టించాడు.
ఈ పోటీల్లో చైనీస్ తైపీ లాంగ్ జంపర్ యూ టాంగ్ లిన్(Yu Tang Lin) బంగారు పతకం గెలిచాడు. అతను ఏకంగా 8.40 మీటర్ల దూరం దూకాడు. ఫైనల్లో అతడికి శ్రీశంకర్, చైనాకు చెందిన మింగ్కున్ జాంగ్(Mingkun Zhang) నుంచి గట్టి పోటీ ఎదురైంది. జూన్‌లో భువనేశ్వర్‌లో జరిగిన ఇంటర్ స్టేట్ నేషనల్(Inter-state Nationals) పోటీల్లో భారత స్టార్ లాంగ్ జంపర్ 8.41 మీటర్లతో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేశాడు. కానీ, ఫైనల్లో మాత్రం అంత దూరాన్ని అందుకోలేకపోయాడు.
ఇవి కూడా చదవండి
Rinku Singh | ఆసియా గేమ్స్ జట్టులో రింకూ సింగ్.. సిక్సర్ల కింగ్ ఇన్‌స్టా పోస్ట్ చూశారా..?
US Open | సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన సింధు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

